‘రుద్రమదేవి’లోని గోనా గన్నారెడ్డి పాత్ర చేయడానికి మహేష్ బాబు, ఎన్టీఆర్ ఆసక్తి చూపించారని దర్శకుడు గుణశేఖర్ తెలిపారు. కానీ పరిస్థితులు అనుకూలించలేదన్నారు. ఆ పాత్ర చివరికి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లిందని, భవిష్యత్తులో తప్పకుండా తాను, NTR పనిచేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా, మహేష్ బాబుతో గుణశేఖర్ ‘ఒక్కడు’ మూవీని తెరకెక్కించారు.