‘పుష్ప 1, 2’ మూవీలకు సీక్వెల్గా ‘పుష్ప3: ది ర్యాంపేజ్’ రాబోతున్నట్లు గతంలో ప్రకటన వచ్చింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో.. ‘పుష్ప 3’ ఉండదేమోనని అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. దుబాయ్ వేదికగా జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో ఈ మూవీపై సుకుమార్ క్లారిటీ ఇచ్చారు. ‘పుష్ప 3’ కచ్చితంగా ఉంటుందన్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.