NLG: గుండ్లపల్లి(డిండి) మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన వడ్డెమాను నారయ్య మృతి బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం నారయ్య మృతదేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంలో ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు.