E.G: రాజమండ్రి శివారు కొంతమూరు గ్రామానికి చెందిన తేజ కుమార్ (30) DSC పరీక్షలో మెరిట్ సాధించలేకపోయాడు. దీంతో మనస్తాపం చెంది నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. B.Ed పూర్తి చేసి జిరాక్స్ దుకాణం నిర్వహిస్తున్న అతను గతంలో DSC రాసినా ఉద్యోగం రాలేదు. ఇటీవల జరిగిన పరీక్షలోనూ విఫలమవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు స్థానికులు తెలిపారు.