E.G: జూద శిబిరంపై దాడిచేసి అయిదుగురిని అరెస్టు చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. రాధేయపాలెం-చక్రద్వారబంధం మధ్య తోటల్లో జూదం ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. గండేపల్లి, రాజానగరం, సామర్లకోటకు చెందిన వారిటగా గుర్తించారు. వారి నుంచి ఒక కారు, ఆటో, మూడు ద్విచ క్రవాహనాలు, ఏడు చరవాణులు, రూ.5,500 స్వాధీనం చేసుకునట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.