PDPL: యైటింక్లయిన్ కాలనీలోని అల్లూరు రోడ్డులో ఏర్పాటు చేసిన నంబర్ 1 వినాయక మండపంలో గణనాథునికి 108 రకాలతో మహాప్రసాదాన్ని భక్తులు గురువారం సమర్పించారు. పూలు, పండ్లు, నైవేద్యాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి 108 రకాల వంటకాలతో మహాప్రసాదాన్ని సమర్పించి, భక్తులకు పంపిణీ చేశారు. కాగా, గణేష్ మండపం భక్తజనంతో కిటకిటలాడింది.