SKLM: శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ శుక్రవారం సాయంత్రం నగర పరిధిలోని పొందిలిపురం, కొత్తపేట గ్రామాలలో పర్యటించారు. గ్రామాల్లోని ప్రజలతో ఎమ్మెల్యే స్వయంగా మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఇటీవల గ్రామాల్లో మరణించిన కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు.