W.G: కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని,రూ. 15 లక్షలు జీవిత బీమా సౌకర్యం కల్పించాలని సీఐటీయు నిరసన చేపట్టారు. వివో ఏ ల జిల్లా విస్తృత సమావేశం నాగిడి గోవిందమ్మ అధ్యక్షతన భీమవరం సీఐటీయు ఆఫీసులో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవరావు మాట్లాడారు. ఈ నెల 9న జిల్లా మహాసభలు భీమవరంలో జరుగుతాయని, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.