TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ శుక్రవారం కుటుంబంతో కలిసి ఆలయానికి విచ్చేశారు. ఇందులో భాగంగా ఆలయం వద్ద టీటీడీ ఛైర్మన్ బీఅర్ నాయుడు, బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి, శాంతారాం స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం పండితులు ఆశీర్వాద మండపంలో వేదాశీర్వచనం చేశారు.