ATP: రాయదుర్గం మండలం ఆయుతపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మానేశ్ (9) అనే బాలుడు శుక్రవారం చెరువులో పడి మృతి చెందాడు. మరో బాలుడితో కలిసి బహిర్భూమికి వెళ్లిన సమయంలో కాలుజారి చెరువులో పడిపోయాడు. మరో బాలుడు గ్రామంలోకి వెళ్లి సమాచారమివ్వడంతో గ్రామస్థులు పరుగెత్తి వెళ్లి బయటకు తీశారు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.