TG: ఇబ్రహీంపట్నం జూపూడిలో 2 రోజుల క్రితం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం కూనయపాలెంకు చెందిన గోపిగా గుర్తించారు. అయితే, విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.