»Good News For Pasidi Lovers Slightly Reduced Prices
Goldprices : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన ధరలు
బులియన్ మార్కెట్(Bullion market)లో ఇటీవల కాలంలో బంగారం (Gold), వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,790 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 60,860 గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.76,600 లుగా కొనసాగుతోంది.
బులియన్ మార్కెట్(Bullion market)లో ఇటీవల కాలంలో బంగారం (Gold), వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,790 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 60,860 గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.76,600 లుగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) గోల్డ్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ నెల 5న రికార్డు స్థాయిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,360 పలికింది. తరువాత క్రమంగా తగ్గుతూ వస్తుంది. గత నాలుగు రోజుల క్రితం 24 క్యారెట్ల బంగారం ధర గరిష్ట స్థాయిని తాకింది. ఆ తరువాత నుంచి క్రమంగా ధరలు తగ్గుముఖం పట్టాయి.
గడిచిన మూడు సెషన్లలో బంగారం ధర తులంపై రూ. 410 మేర తగ్గింది.సోమవారం ఉదయం వరకు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే.. దేశ రాజధాని ఢిల్లీ(Delhi) లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 61,020గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,940గా ఉంది. ముంబై (Mumbai) లో 24 క్యారెట్లు 60,860గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,790గా ఉంది. ఇక చెన్నై(Chennai) లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,520గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,390గా ఉంది.తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,860 పలుకుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,970 గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,860, అదేవిధంగా 22 క్యారెట్ల గోల్డ్ ధర 55,790గా ఉంది. విశాఖపట్టణంలో 24 క్యారెట్ల ధర రూ. 60,860 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 55790గా ఉంది.
ఇక వెండి ధరల (Silver prices) విషయానికి ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 76,600గా ఉంది. అదేవిధంగా ముంబైలో కిలో వెండి ధర రూ. 76వేలు, చెన్నైలో 80,200, కేరళలలో 76,600గా ఉంది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 80,200 కాగా, విజయవాడలో రూ. 80,200, విశాఖపట్టణం(Visakhapatnam) లో 80,200 గా ఉంది. గోల్డ్ ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఏప్రిల్ 5న 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రికార్డు స్థాయికి చేరింది. 61,360 పలికింది. ఆ తరువాత రోజు నుంచి క్రమంగా ధర తగ్గుతూ వచ్చింది. ఏప్రిల్ 6న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 60,980 ఉండగా, 8వ తేదీన 60,870కి చేరింది. తాజాగా సోమవారం 60,860కి చేరింది.