WNP: పెబ్బేరు(M) రంగాపురం గ్రామ సమీపంలో అర్థరాత్రి సుచి రెస్టారెంట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాచహల్లి గ్రామానికి చెందిన 12 మంది బీచుపల్లిలో గణేష్ నిమజ్జనం ముగించుకుని తిరిగి వస్తుండగా అతివేగంతో వస్తున్న డీసీఎం వెనుక నుంచి ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.