GDL: పాము కాటుతో మహిళా మృతి చెందిన సంఘటన ఎర్రవల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. పుటాన్ దొడ్డి గ్రామానికి చెందిన సల్వమ్మ పంట పొలాలలో వ్యవసాయ పనులు చేస్తుండగా పాము కాటుకు గురైందని సమీప కూలీ కార్మికులు తెలిపారు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.