KRNL: ఆదోని పట్టణంలోని కార్వాన్పేట కాలనీలో ఇంటి ముందు పని చేసుకుంటున్న వృద్ధురాలిపై రోడ్డుపై ఉన్న కుక్క దాడి చేసింది. ఈ దాడిలో ఆమె రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కుక్కను విడదీయడానికి ప్రయత్నించినా అది వదలలేదు. బాధితురాలిని వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోజురోజుకు కుక్కల దాడులు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.