RR: 23 ఏళ్ల అరిఫుద్దిన్ హిమాయత్ సాగర్లో అనుకోకుండా మునిగిపోగా మృతదేహాన్ని బయటకు తీసినట్టు TG ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది. బృందం ADFO రాజేంద్రనగర్ శ్రీనివాస్ నాయకత్వంలో గాలింపు చర్యలు ప్రారంభించి, రాత్రంతా శోధన కొనసాగించి మృతదేహాన్ని వెలికితీసి సంబంధిత అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు.