ATP: గుత్తి ఆర్ఎస్కు చెందిన యువతి 2 రోజుల క్రితం అదృశ్యమైంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రైనీ ఎస్సై గౌతమ్, కానిస్టేబుళ్లు భాస్కర్ నాయుడు, మహాలక్ష్మి నిఘా ఏర్పాటు చేసి విజయవాడలో ఉన్న ఆ యువతిని గుర్తించారు. బుధవారం పోలీసులు యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు.