అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ జోరుతో భారత రూపాయి విలువ చారిత్రక కనిష్టానికి పడిపోయింది. ఇవాళ ఒక్కరోజే రూపాయి విలువ ఏకంగా 67 పైసలు క్షీణించి, డాలర్‌తో పోలిస్తే 92.17 వద్ద ముగిసింది. ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ఈ పతనానికి ప్రధాన కారణాలని తెలుస్తోంది. రూపాయి బలహీనపడటంతో దిగుమతులపై భారం పెరిగి, నిత్యావసర ధరలు పెరిగే అవకాశం ఉంది.