ఆఫ్గనిస్థాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో నమోదైంది. ఈ భూకంపం వల్ల జరిగిన నష్టంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఆఫ్గనిస్థాన్‌లో వరుస భూకంపాలు కలకలం సృష్టిస్తున్నాయి. దీనికితోడు ఇటీవల దేశాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. కాగా, ఆ దేశంలో ఇటీవల సంభవించిన భూకంపం వాళ్ళ 1400 మందికిపైగా మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే.