జీ సినీ అవార్డ్స్ 2026 వేదికగా బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ ఉత్తమ నటి అవార్డను గెలుచుకుంది. ‘తేరే ఇష్క్ మే’ మూవీలో నటనకు గాను ఈ అవార్డు లభించింది. అయితే, ఆమెను విజేతగా ప్రకటించగానే SMలో విమర్శలు హోరెత్తాయి. ఈ అవార్డుకు యామీ గౌతమి అర్హురాలని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘హక్’ మూవీలో యామీ నటన అద్భుతమని, ఆమెను కాదని కృతికి అవార్డు ఇవ్వడం సరికాదని మండిపడుతున్నారు.