KRNL: మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని మంగళవారం నందవరం ఎస్సై తిమ్మారెడ్డి హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారిని వదిలే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతిరోజూ తనిఖీలు నిర్వహిస్తామని, ప్రాణాపాయం కలిగించేలా వ్యవహరించవద్దని కోరారు.