T20 WC 2026 సెమీస్‌లో 4 ఖండాల నుంచి 4 వేర్వేరు దేశాలు(SA-ఆఫ్రికా, NZ-ఓషియానియా, IND-ఆసియా, ENG-యూరోప్) తలపడుతున్న సంగతి తెలిసిందే. గత 9 టోర్నీల రికార్డులు గమనించినా.. ప్రతిసారీ ఆసియా నుంచి కనీసం ఓ జట్టు(భారత్, పాక్, లంక, అఫ్గన్) అయినా నాకౌట్స్‌లో తలపడింది. ఆసియా తర్వాత.. ఓషియానియా నుంచి 2009, 14, 24 మినహా అన్ని టోర్నీల్లోనూ ఆస్ట్రేలియా/న్యూజిలాండ్/రెండూ ఆడాయి.