GNTR: ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు మృతిచెందారు. ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో భార్గవ్ (23) అక్కడికక్కడే మరణించగా, ఆయన తండ్రి వెంకటేశ్వర్లు (55) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.