KDP: కలసపాడు మండలం తంబళ్లపల్లెలో విద్యుదాఘాతంతో బర్రె మృతి చెందింది. పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ మరీ కిందకు ఉండడంతో అదే గ్రామానికి చెందిన రైతు నడిపి చించిరెడ్డి బర్రె మృతి చెందిందని అతను వాపోయారు. ఈ బర్రె సుమారు రూ. 50 వేలు విలువ చేస్తోందని అన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా, ట్రాన్స్ఫార్మర్ కిందకు ఉండకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.