E.G: కొవ్వూరులోని ఇందిరమ్మకాలనీకి చెందిన చెరుకూరి కరుణ (22) అదృశ్యంపై కొవ్వూరు పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదు అయ్యింది. మహిళకు అదే ప్రాంతానికి చెందిన దుర్గారావుతో వివాహమైంది. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఈమె గత నెల 30వ తేదీ రాత్రి బయటకు వెళ్లి తిరిగి రాలేదని, ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదని దుర్గారావు పోలీసులను ఆశ్రయించారు.