నేపాల్‌లో కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి ఎల్లుండి జరిగే పోలింగ్‌లో కోటి ఎనభై లక్షల మందికి పైగా అక్కడి ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు ప్రవర్తనా నియమావళి అమలు చేస్తుంది. నేపాల్ ప్రతినిధుల సభలో 165 నియోజకవర్గాలు ఉన్నాయి.