AP: దేశానికి సేవ చేసే అవకాశం దక్కడం సంతోషంగా ఉందని గోవా నూతన గవర్నర్ అశోక్ గజపతిరాజు అన్నారు. అవకాశాల కోసం ఎప్పుడూ వెంట పడలేదని తెలిపారు. తనకు అవకాశాలు దక్కినప్పుడు వదులుకోలేదని చెప్పారు. తెలుగువారి ఔన్నత్యాన్ని పెంచాల్సిన అవసరం తనపై ఉందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని.. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.