SKLM: జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని సోమవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 3 కేజీల గంజాయి, 9 గ్రాముల బంగారం, 8 కేజీల వెండి, ఒక ద్విచక్ర వాహానాన్ని స్వాధీనం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.