BHNG: యాదగిరిగుట్టలోని గండి చెరువు ఇటీవల కురిసిన వర్షాలకు పొంగిపొర్లుతోంది. దీంతో అధికారులు చెరువు ధూమ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. వంగపెల్లి నుంచి వచ్చే వాహనాలను రింగ్ రోడ్డు మీదుగా తరలిస్తున్నారు. వంగపెల్లి వైపు వెళ్లే వాహనాలు కూడా రింగ్ రోడ్డు మీదుగా యాదగిరిపల్లి మీదుగా వెళ్లాలన్నారు.