NLG: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శాలిగౌరారం ఎంపీడీవో కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా సందర్శించి దరఖాస్తుల వివరాలను ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, తహసీల్దారు జమీరుద్దీన్లను అడిగి తెలుసుకున్నారు. మండలంలో 176 దరఖాస్తులకు గాను 73 వచ్చాయని, 23 పూర్తిస్థాయిలో పరిశీలించడం జరిగిందని తెలిపారు.