ELR: 2022లో టిడ్కో ఇళ్ల పంపిణీ సందర్భంగా అప్పటి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై దాడి కేసును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. ఈ కేసు దర్యాప్తు నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ యడ్ల తాతాజీ, గుణ్ణం నాగబాబుతో సహా పలువురు వైసీపీ నాయకులు జిల్లా కోర్టుకు హాజరయినట్లు తెలిపారు.