SKLM: జలుమూరు మండలం అల్లాడ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గురువారం గ్రామానికి చెందిన అధికర్ల రామారావు దంపతులు సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట చేపట్టారు. స్థానిక పురోహితులు వేదమంత్రాలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రధానోపాధ్యాయులు సేపాన రామచంద్రరావు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.