HYD: ఆషాఢమాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారి ఘటస్థాపన సామూహిక ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరగనుంది. పాతబస్తీలోని 22 ఆలయాలకు చెందిన అమ్మవారి ఘటాల ప్రతిష్ఠాపన ప్రధాన ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తారు. ఇప్పటికే నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మధ్యాహ్నం శాలిబండలోని కాశీ విశ్వనాథ ఆలయం నుంచి ఊరేగింపు ప్రారంభమవుతుంది.