GDWL: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ పరిధికి సంబంధించిన లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఎమ్మెల్యే సూచించారు.