AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో రామ్ నగర్, కొత్త ఎర్రవరం గ్రామాలకు మంచినీటి సరఫరాకు ఆదివారం అంతరాయం కలుగుతుందని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు తెలిపారు. మంచినీటి సరఫరా చేసే ఓ మోటారు మరమ్మతులకు గురికావడంతో మంచినీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. పలు ప్రాంతాలకు పాక్షికంగా మంచినీటి సరఫరా జరుగుతుందన్నారు.