SDPT: రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతుంటే ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉందని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి ఆరోపించారు. గురువారం గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పంట నష్టం జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.