ATP: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదివారం ఉదయం డి.హీరేహల్ మండలంలో పర్యటించారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా మురుడి గ్రామంలో ఇంటింటికీ వెళ్లారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన విజయాలను ప్రజలకు వివరించారు. అనంతరం కరపత్రాలు పంపిణీ చేసి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? అని ఆరా తీశారు. గ్రామ సమస్యలు తెలుసుకున్నారు.