కోనసీమ: ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని BJP సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ అన్నారు. గురువారం మండపేటలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరు స్వదేశీ వస్తువులు కొని దేశ భక్తిని చాటుకోవాలని కోరారు. స్వదేశీ ఉద్యమానికి సమాజం, యువత నాయకత్వం వహించాలని పేర్కొన్నారు.