WGL: కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో ఆగస్టు28, 29 తేదీలలో జరుగనున్న డిగ్రీ మరియు పీజీ పరీక్షలను భారీ వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్టు గురువారం విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల ఒక ప్రకటనలో తెలిపారు. మిగతా పరీక్షలు యధావిధిగా జరుగుతాయని, వాయిదా వేసిన పరీక్షలు మరలా ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.