నందమూరి బాలకృష్ణతో దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న మూవీ ‘అఖండ 2’. సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ అప్డేట్స్ రాకపోవడం, ఇటీవల నందమూరి ఇంట విషాదం నెలకొన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని వాయిదా వేయనున్నారట. అయితే డిసెంబర్ 4న లేదా ఆ తర్వాతి తేదీల్లో దీన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.