KNR: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నగరంలోని పాత బజార్లో ఉన్న ‘నెంబర్ వన్’ గణపతిని కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ గణనాథునికి ఒక ప్రత్యేకత ఉంది. నవరాత్రులు పూర్తయిన తర్వాత నగరంలోని అన్ని వినాయక విగ్రహాలు టవర్ సర్కిల్‌కు చేరుకుంటాయి. అయితే మొదటగా పాత బజార్ గణపతి విగ్రహం టవర్ సర్కిల్‌కు వచ్చి పూజలు అందుకుంటుంది.