ప్రకాశం: జిల్లాలో నేటి నుంచి సెప్టెంబర్ 8 వరకు జరుగు నేత్రదాన పక్షోత్సవాలను జయప్రదం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా కోరారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో 40 జాతీయ పక్షోత్సవాల కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ‘నేత్రదానం చేయండి ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించండి’ అనే నినాదంతో కార్యక్రమం నిర్వహించాలన్నారు.