MNCL: ఈనెల 31న మందమర్రి పట్టణంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో రాష్ట్రస్థాయి కరాటే, కుంగ్ ఫూ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు అల్సైల్ మార్షల్ ఆర్ట్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగు శ్రీనివాస్, అసోసియేషన్ అధ్యక్షుడు హరికృష్ణ తెలిపారు. సుమారు 500మంది క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు.