MNCL: కన్నెపల్లి మండలంలోని లింగాల శివారులో పులి పాదముద్రలు కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనలకు గురయ్యారు. ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు ఈ పాదముద్రలను గమనించి గ్రామంలో అందరికీ తెలియజేశారు. ఈ సమాచారంతో ఆందోళనకు గురైన స్థానికులు పెద్ద సంఖ్యలో చేరి వాటిని పరిశీలించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.