NLR: ఇరు కళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సమీపంలోని గణేష్ నిమజ్జన ఘాట్ వద్ద ఏర్పాట్లను టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమజ్జనానికి వచ్చే గణేష్ విగ్రహాలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తాగునీటితో పాటు ఇతర మౌలిక వసతులను మరింత మెరుగుపరచాలన్నారు. అధికారులు సమాన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.