KMM: బోనకల్ SR ఫంక్షన్ హాల్లో ఈనెల 30న జరగబోయే సన్నాహక సదస్సుకు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని MRPS నాయకుడు కందికట్ల విజయ మాదిగ తెలిపారు. చింతకాని మండలంలోని చిన్నమండవలో మాట్లాడారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. పెన్షన్లు పెంచకపోతే ప్రభుత్వంపై యుద్ధం తప్పదని హెచ్చరించారు.