TG: రైతురాజ్యం ఎవరు తెచ్చారో చర్చకు రావాలని CM రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ‘రైతులకు ఎవరు ఏం చేశారో ప్రజలకు తెలుసు. రైతు రాజ్యం ఎవరు తెచ్చారో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. పదేళ్లు రైతు కేంద్రంగా ప్రభుత్వం నడిపాం. రైతు సంక్షేమంపై ఎక్కడైనా చర్చకు మేం సిద్ధం. ఈనెల 8వ తేదీన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు రండి. ప్రిపేరై రండి చర్చిద్దాం’ అని సవాల్ విసిరారు.