SKLM: కోటబొమ్మాలి మండలం నిమ్మాడ స్వగ్రామంలో గ్రామస్తులు ఏర్పాటుచేసిన గణేష్ ఉత్సవాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రజలకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా చూడాలని స్వామివారిని కోరుకున్నారు.