MDK: గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ పట్టణంలోని పలు వార్డులల్లో లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పర్యటించారు. దీనిలో భాగంగా మెదక్ 18వ వార్డులో ఫజియా బేగం అనే మహిళ గృహం పాక్షికంగా ధ్వంసం కాగా ఇంటిలోకి నీళ్లు చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాధితురాలికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.