ఇంగ్లండ్, భారత్ మధ్య రెండోరోజు మ్యాచ్లో టీమిండియా ప్లేయర్లు విరామం తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు డేవిడ్ లాయిడ్ భారత్ జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ ఆటగాళ్లు 85 పౌండ్లు ఖర్చు చేసి వచ్చేది గడ్డి పెరిగిందా అని చూడటానికి కాదని అన్నాడు. కాగా భారత జట్టు ఆధిపత్యంలో ఉన్నందుకే ఇలా అక్కసు వెళ్లగక్కుతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.